Monday, August 19, 2019
Follow Us on :

రెండేళ్ల త‌ర్వాత మంత్రుల‌ను మారుస్తా: జ‌గ‌న్‌

By BhaaratToday | Published On Jun 7th, 2019

వైసీపీ అధినేత, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన సుమారు రెండు గంటలపాటు జరిగిన వైసీపీఎల్పీ సమావేశం ముగిసింది. శుక్రవారం ఉదయం సరిగ్గా 10 గంటలకు ప్రారంభమై 12 గంటలకు సమావేశం ముగిసింది. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి 151 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కీలక ప్రకటనలు.. ముఖ్యంగా ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకున్నారు.

మొత్తం 25 మంది మంత్రులతో పూర్తిస్థాయి కేబినెట్‌ ఏర్పాటు చేయనున్నట్లు జగన్ స్పష్టం చేశారు. మరోవైపు ఎవరూ ఊహించని విధంగా ఒకరిద్దరు కాదు ఏకంగా.. ఐదుగురిని డిప్యూటీ సీఎంలను నియమిస్తున్నట్లు జగన్ తేల్చిచెప్పారు. అంతేకాదు పార్టీలో తమకు మంత్రి పదవులు దక్కలేదని ఎవరూ అసంతృప్తికి లోను కాకుండా ఉండేందుకు గాను.. రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం మంత్రులను మారుస్తామని జగన్‌ సంచలన ప్రకటన చేశారు. ఇప్పుడు మంత్రి పదవి ఆశించి భంగపడ్డ వారికి అప్పుడు కేటాయిస్తామని జగన్ చెప్పేశారు. కేబినెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వారికి అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు చెప్పారు. అయితే వీరిలో కొత్తవారు కూడా ఉంటారని జగన్ ప్రకటించేశారు. కాగా.. శనివారం ఈ 20 మంది మంత్రులతో పాటు.. ఐదుగురు డిప్యూటీ సీఎంలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.