Monday, November 18, 2019
Follow Us on :

బొద్దింకల.. ఫ్యామిలీ.. ఫ్యామిలీ.. చెవి నుండి బయటకు వచ్చేసింది..!

By BhaaratToday | Published On Nov 8th, 2019

బొద్దింకలు.. ఎక్కడైనా హ్యాపీగా బ్రతికేస్తాయంటారు. అదేదో డిఫరెంట్ టెంపరేచర్లలో బ్రతికేస్తాయేమో అనుకోవచ్చు.. కానీ ఏకంగా చెవుల్లో కూడా బ్రతికేస్తూ ఉంటాయి.  నిజమండీ.. తాజాగా ఓ వ్యక్తి చెవి నుండి ఏకంగా ఒక బొద్దింకల ఫ్యామిలీనే బయటకు వచ్చింది. సారీ.. బయటకురాలేదు.. వైద్యులే బయటకు తీసేశారు. అందుకే బొద్దింకలతో జాగ్రత్త అనేది..! 

చైనాకు చెందిన ఓ 24 ఏళ్ల యువకుడికి ఈ మధ్య విపరీతమైన చెవి నొప్పి వచ్చేది. అంతే కాకుండా అతడి చెవిలో ఏదో కదులుతున్నట్లుగా అనిపిస్తూ ఉండడంతో.. చెవిలో ఏముందో టార్చ్ లైట్ వేసి చూడమన్నాడు. అతడు చెప్పినట్లే చెవిలో ఏవో కదిలినట్లు కనిపించాయి. ఇంకంతే టెన్షన్ తో డాక్టర్ల దగ్గరకు వెళ్లారు. సాన్హే ప్రాంతంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు అతడి చెవిలో లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి చూడగా.. అందులో బొద్దింకలు ప్రవేశించాయని అనుకున్నారు. చెవి లోపలి భాగం నుంచి పెద్ద బొద్దింకతో పాటు 10 చిన్న బొద్దింకలు ఉన్నట్లు తెలుసుకున్నారు. దీంతో వైద్యులు కష్టపడి ఆ బొద్దింకల ఫ్యామిలీని బయటకు తీశారు. బొద్దింకల కారణంగా ఆ వ్యక్తి చెవికి ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యులు తెలిపారు.

Image result for cockroach family in ear