Thursday, April 25, 2019
Follow Us on :

త్రివిక్రమ్‌ను నాకోసమే హైదరాబాద్ తీసుకువచ్చాను: సునీల్‌

By BhaaratToday | Published On Apr 15th, 2019

హ‌స్య‌న‌టుడు సునీల్ సినీ ప‌రిశ్ర‌మ‌ల‌తో త‌న‌కంటే ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా చిత్రలహరి సినిమాలో సునీల్ సెకండ్ ఇన్నింగ్స్ ను ఆశించిన స్థాయిలో కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి చెప్పుకొచ్చారు. భీమవరంలో త్రివిక్రమ్ తనకంటే ఏడాది సీనియర్ అని, సినిమాలపై మోజుతో మొదట తాను హైదరాబాద్ వచ్చానని, ఆ తర్వాత త్రివిక్రమ్ ను తీసుకొచ్చానని పేర్కొన్నారు. మీ బాధలను పంచుకునే 'గ్లాస్' మేట్ ఎవరు? అన్న ప్రశ్నకు టక్కున "త్రివిక్రమ్. అని చెప్పారు. "త్రివిక్రమ్ ను నాకోసమే హైదరాబాద్ తీసుకువచ్చాను. అందుతో నా స్వార్థం ఉంద‌న్నారు. ఎలాంటి విషయాన్నయినా పంచుకోగలిగే మిత్రుడు త్రివిక్రమ్. త్రివిక్రమ్ తో కాసేపు మాట్లాడితే చాలు ఎంతో ఉత్తేజం వస్తుంది. ఎవరు, ఎంత బాధలో ఉన్నా వాళ్లను మామూలు మనుషుల్ని చేయగలడు" అంటూ వివరించారు.