Wednesday, November 20, 2019
Follow Us on :

ఇటీవ‌ల చ‌నిపోయిన‌ట్లుగా వ‌చ్చిన పుకార్ల‌పై స్పందించిన సునీల్‌

By BhaaratToday | Published On Apr 15th, 2019

హీరోగా ఆశించినస్థాయిలో విజయాలు దక్కకపోవడం .. సినిమాకి సినిమాకి మధ్య గ్యాప్ ఎక్కువగా వస్తుండటంతో, తిరిగి కమెడియన్ గా కొనసాగాలని సునీల్ నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి ఆయన కమెడియన్ గా చేస్తూ వస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా వచ్చిన 'చిత్రలహరి' ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్ష‌కుల‌ముందుకు వ‌చ్చింది. తాజా ఇంటర్వ్యూలో సునీల్ మాట్లాడుతూ .. ఇటీవల తను చనిపోయినట్టుగా వచ్చిన పుకార్లపై స్పందించాడు. "సోషల్ మీడియా కారణంగా పరిస్థితులు చాలా దారుణంగా మారుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఒక వెబ్ సైట్ వాళ్లు .. రోడ్డు ప్రమాదంలో నేను చనిపోయానని రాసేశారు. ఆ వార్త వలన వాళ్లకి ఒక మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఒక మిలియన్ వ్యూస్ కోసం నన్ను చంపేస్తారా? అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటి వార్త కారణంగా ఆ ఇంట్లో వాళ్లు ఎంత బాధపడతారో తెలియాలంటే, ఇలాంటి వార్తను రాసినవారి కుటుంబ సభ్యులపై ఇలాంటి వార్త వచ్చినప్పుడే తెలుస్తుంది. ఏ వార్తనైనా నిజానిజాలు తెలుసుకుని రాస్తే బాగుంటుంది" అని చెప్పుకొచ్చాడు.