Thursday, August 22, 2019
Follow Us on :

బాల‌కోట్ దాడుల గురించి వివ‌రించిన అభినంద‌న్ తండ్రి వ‌ర్ధ‌మాన్‌

By BhaaratToday | Published On Apr 4th, 2019

భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ తండ్రి, మాజీ ఎయిర్ మార్షల్ సింహకుట్టీ వర్ధమాన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ దేశంలోని బాలాకోట్ పట్టణంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన వేసిన లేజర్ గైడెడ్ స్మార్ట్ బాంబు దాడితో 250 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారని వర్థమాన్ పేర్కొన్నారు. అయితే మద్రాస్ ఐఐటీలో విద్యార్థులనుద్ధేశించి వర్థమాన్ మాట్లాడుతూ బాలాకోట్ దాడుల గురించి వివ‌రించారు. బాలాకోట్ ఉగ్రవాద శిక్షణ శిబిరంలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన సభ్యులున్నారని, భారతవాయుసేన వేసిన బాంబు వల్ల భవనం దెబ్బతినకున్నా, దీనివల్ల ఎక్కువమంది మరణించి ఉంటారని వర్థమాన్ చెప్పారు. బాలాకోట్ దాడిలో 300 మంది ఉగ్రవాదులు మరణించి ఉంటారని ఐఐటీ విద్యార్థులకు వివరించారు.