Monday, November 18, 2019
Follow Us on :

రామ్ గోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు.. ఈసారి ఎందుకో తెలుసా..?

By BhaaratToday | Published On Apr 16th, 2019

రామ్ గోపాల్ వర్మ.. తన గురించి ఎవరు ఏమనుకున్నా డోంట్ కేర్.. ఎవరేమి చేసినా పట్టించుకోరు ఆయన..! తన సినిమాల ప్రమోషన్ల కోసం ఎవరినైనా వాడేసుకుంటూ ఉంటారు. ఏ పనినైనా చేస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. కొద్ది రోజుల క్రిందట లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్స్ లో ఎన్నో మార్ఫింగ్ ఫోటోలను వర్మ తన సోషల్ మీడియా అకౌంట్లలో పెట్టుకుంటూ వచ్చారు. ఇక రెండు మూడు రోజుల క్రితం అయితే ఏకంగా చంద్రబాబు నాయుడు వైసీపీలో చేరినట్లు.. వైసీపీ కండువా కప్పుకున్నట్లు ఫోటో ఒకటి పెట్టారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అయితే ఆ ఫోటో నచ్చకపోవడంతో వర్మ మీద ఏకంగా ఫిర్యాదు చేశారు. 

 హైదరాబాద్ పేట్ బషీర్ బాద్ పోలీస్ స్టేషన్ లో గోపి అనే వ్యక్తి ఈ ఫోటోలపై ఫిర్యాదు చేశారు. ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాల్లో మార్ఫింగ్ ఫోటోలు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరినట్టు మార్ఫింగ్ చేసిన ఫొటోను వర్మ పెట్టారని చెప్పారు. వర్మ తీరుతో అభిమానుల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. ఇక దీనిపై వర్మ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.