Friday, March 22, 2019
Follow Us on :

కేసీఆర్‌తో స‌బితా ఇంద్రారెడ్డి భేటీ...పార్టీలో చేరే అంశంపై చ‌ర్చ‌!

By BhaaratToday | Published On Mar 13th, 2019

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్‌పార్టీకి గట్టి షాక్‌తగిలింది. మాజీ హోం మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌పార్టీకి గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది. తనయుడు కార్తీక్‌రెడ్డితో సహా ఆమె టీఆర్‌ఎస్‌పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో తమ ఎమ్మెల్యేను పార్టీ మారకుండా బుజ్జగించేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్‌అధిష్టానం వ్యూహాలు బెడిసికొట్టినట్లైంది. కాగా టీఆర్‌ఎస్‌వర్కింగ్‌ప్రెసిడెంట్‌కేటీఆర్‌తో సబిత ఇటీవల భేటీ అయినట్లు వార్తలొచ్చాయి. ఈ క్రమంలో సబితా ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డిలకు పార్టీల సముచిత స్థానం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.  ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌లో చేరే విషయంపై కేసీఆర్‌తో చర్చిస్తున్నారు. సబితా ఇంద్రారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతారని కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక సబిత వెంటే తామంతా ఉంటామని మహేశ్వరం నియోజకవర్గం ప్రజలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.