Tuesday, October 15, 2019
Follow Us on :

పాకిస్థాన్ కు అక్కడ కూడా భంగపాటే..!

By BhaaratToday | Published On Sep 2nd, 2019

కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసాక.. భారత్ మీద పాకిస్థాన్ గుర్రుగా ఉంది. భారత్ కు వ్యతిరేకంగా పలు దేశాల మద్దతు కూడగట్టుకోవాలని భావించినా అది వీలుపడలేదు. చైనా తప్ప ఏ అగ్రదేశం కూడా పాక్ కు మద్దతు ఇవ్వలేదు. ఐక్యరాజ్య సమితిలో కూడా పాక్ కు భంగపాటు ఎదురవ్వగా.. ఇప్పుడు మరోసారి అలాంటి పరాభవమే ఇంకోసారి ఎదురైంది.  

సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-సాధన అనే అంశంపై మాల్దీవుల్లో జరిగిన దక్షిణాసియా దేశాల స్పీకర్ల సదస్సులో పాకిస్థాన్ చేసిన ఆరోపణలను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ తిప్పికొట్టారు. మాల్దీవులు పార్లమెంటులో జరిగిన సదస్సులో భాగంగా పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఖాసిమ్‌ సురీ మాట్లాడుతూ.. ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని అన్నారు. 

అయితే హరివంశ్‌ మాత్రం అంతర్జాతీయ వేదికలపై భారత్‌ అంతర్గత వ్యవహారాలను రాజకీయం చేయడం సరైంది కాదని పాకిస్థాన్ కు కౌంటర్ ఇచ్చారు. పాక్‌ ఆరోపణలకు భారత్ గట్టిగా జవాబు ఇవ్వగలదని.. సదస్సు ముఖ్య ఉద్దేశం అది కాదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ‘ శాంతి స్థాపన, సుస్థిరావృద్ధికి ఆటంకం కలిగిస్తున్న సీమాంతర ఉగ్రవాదానికి, ఉగ్రవాదులకు పాక్‌ సహాయం నిలిపివేయాలని చెబుతూ పాకిస్థాన్ ను దోషిగా నిలబెట్టేసరికి సైలెంట్ అయింది పాకిస్థాన్.