Monday, November 18, 2019
Follow Us on :

తెలంగాణ బంద్ లో అమానుషం.. సీపీఐఎంఎల్ నేత రంగారావు బ్రొటన వేలు తెగి పడింది

By BhaaratToday | Published On Oct 19th, 2019

సీపీఐఎంఎల్ నేత రంగారావు బ్రొటన వేలు కట్ అయిపోయింది. పోలీసులు తన వేలును వాహనం డోర్ మధ్యన వేశారని రంగారావు ఆరోపిస్తున్నారు. బంద్ కు మద్దతు తెలిపినందుకు తమను ఇలా హింసిస్తారా అని ఆయన ఆరోపించారు. 

ఇక తెలంగాణ బంద్ ఉదృతమవుతోంది. పలు యూనియన్లు బంద్ లలో పాల్గొంటున్నాయి. కొన్ని చోట్ల బస్సులను బయటకు తీయాలని తాత్కాలిక ఉద్యోగులు ప్రయత్నించగా వారిని ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. కొన్ని చోట్ల తాత్కాలిక డ్రైవర్లను కొట్టారు. హైదరాబాద్ లో పలు చోట్ల రాస్తారోకో నిర్వహిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్యాబ్ లూ, ఆటోలు కూడా పెద్దగా రోడ్ల మీద కనిపించడం లేదు.