Wednesday, October 16, 2019
Follow Us on :

జవాన్లకు సెలవులు రద్దు…ఎందుకంటే…!

By BhaaratToday | Published On Aug 3rd, 2019

జమ్మూకశ్మీర్ లోయలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) తన సిబ్బందికి సెలవులను రద్దు చేసింది. పాకిస్థానీ ఉగ్రవాదులు అమర్‌నాథ్‌ యాత్రపై దాడులకు కుట్ర పన్నిన నేపథ్యంలో సీఆర్‌పీఎఫ్ అప్రమత్తం అయింది కశ్మీర్‌లో అమర్‌నాథ్‌ యాత్రపై పాకిస్థాన్‌ దాడులకు పాల్పడేందుకు ప్లాన్ వేసింది. దీంతో ఆర్మీ వర్గాలు ముందే పసిగట్టి అనేక చోట్ల పెద్ద ఎత్తున ఐఈడీలు, మారణాయుధాల గుర్తించింది.  దీంతో వెంటనే కశ్మీర్ను విడిచి స్వరాష్ట్రాలకు వెళ్లిపోవాలని యాత్రికులను సర్కారు ఆదేశించింది. దీంతో సెలవులో ఉన్న సీఆర్‌పీఎఫ్ జవాన్లు వీలైనంత త్వరగా విధులకు హాజరు కావాలని సీఆర్‌పీఎఫ్ అధికారులు ఆదేశించారు. సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశముందని నిఘా వర్గాలు చేసిన హెచ్చరికల నేపథ్యంలో సీఆర్‌పీఎఫ్ దాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు సమాయత్తమైంది.