Thursday, August 22, 2019
Follow Us on :

‘డియర్ కామ్రేడ్’ ట్రైలర్ రిలీజ్‌

By BhaaratToday | Published On Jul 11th, 2019

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సమయం వచ్చేసింది. ‘డియర్ కామ్రేడ్’ థియేట్రికల్ ట్రైలర్‌తో ఫ్యాన్స్ ముందుకు వచ్చేశాడు. ఇప్పటికే టీజర్, పాటలతో విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన ‘కామ్రేడ్’.. ఈ ట్రైలర్‌తో అంచనాలను మరింత పెంచేశాడు. ఈనెల 26న థియేటర్‌లో అభిమానుల ముందుకు రానుంది.

స్టూడెంట్ లీడర్ బాబి, స్టేట్ క్రికెట్ ప్లేయర్ లిల్లీల లవ్‌స్టోరీ ఈ ‘డియర్ కామ్రేడ్’. ‘ఒక కామ్రేడ్ పోరాడితో ఆ పోరాటం అతనికి హాయినివ్వాలి.. స్వేచ్ఛనివ్వాలి. నిన్ను చూస్తే అలా లేవు’ అంటూ చారుహాసన్ చెప్పే డైలాగుతో ట్రైలర్ ప్రారంభమైంది. ఇక ఆ తరవాత విజయ్‌లోని కోపాన్ని, ఎమోషన్‌ను చూపించారు. అంటే కామ్రేడ్‌కు ఉండాల్సిన ప్రశాంతత ఇతనిలో క‌నిపించ‌దు. కాలేజీలో రాజకీయాలపై ఎదురెళ్లిన నాయకుడు చైతన్య(బాబి)గా విజయ్ దేవరకొండ నటించారు. ధైర్యం, తెగువ చాలా ఎక్కువ. విపరీతమైన కోపం. ఇలాంటి వ్యక్తి ఒక క్రికెట్ ప్లేయర్‌(రష్మిక మందన)తో ప్రేమలో పడతాడు. ఆ తరవాత ఈ ప్రేమ ప్రయాణం ఎలా సాగింది, చివరకు ఏమైంది అనేదే సినిమా. ట్రైలర్ చూస్తుంటే ఇదే విషయం అర్థమవుతోంది. 

‘డియర్ కామ్రేడ్’ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది. ట్రైలర్‌ను కూడా అన్ని భాషల్లో ఒకేసారి గురువారం విడుదల చేశారు. ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చారు. మైత్రీ మూవీమేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌శ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.