Thursday, July 18, 2019
Follow Us on :

ఖాతా తెరవని రాయల్స్.. ముచ్చటగా దిల్లీ మూడో విజయం

By BhaaratToday | Published On Apr 7th, 2019

రాయల్‌ ఛాలెంజర్స్‌ రాత మారలేదు. వరుస ఓటములతో కుదేలవుతుంది. ఆదివారం దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్స్ మెన్ వైఫల్యంతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఎనిమిది వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేసింది. జట్టులో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(41, 33 బంతుల్లో 1x4, 2x6) ఒక్కడే నిలకడగా ఆడి బెంగళూరు ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఎంతో సహనంతో ఒంటరి పోరాటం చేశాడు.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన దిల్లీ క్యాపిటల్స్‌ దూకుడుగా ఆడింది. చివర్లో కాస్త తడబడ్డా లక్ష్యాన్ని చేంఒచింది . కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(67, 43 బంతుల్లో 8x4, 2x6) అర్ధశతకం సాధించాడు. 18.5 ఓవర్లలో వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ ఓటమితో రాయల్‌ ఛాలెంజర్స్‌ వరుసగా ఆరో ఓటమి మూటకట్టుకోగా.. దిల్లీ మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.