Monday, August 19, 2019
Follow Us on :

ఆర్టీసీ బస్సులో యువతి డ్యాన్స్‌.. పాపం డ్రైవ‌ర్ ప‌రిస్థితి..

By BhaaratToday | Published On Jul 18th, 2019

ఆర్టీసీ బస్సులో ఓ యువతి డ్యాన్స్‌తో అదరగొడితే చూస్తూ ఎంజాయ్ చేసిన డ్రైవర్ సస్పెండయ్యాడు. కండక్టర్‌కు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బస్సులోని మార్షల్స్‌ను సివిల్ డిఫెన్స్ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. ఢిల్లీలో జరిగిందీ ఘటన. ఇంతకీ ఏం జరిగిందంటే.. గత నెల 12న జనక్‌పురి ప్రాంతంలో ఢిల్లీ ఆర్టీసీ బస్సు లోపల ఓ యువతి హర్యాణవి పాటకు డ్యాన్స్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. డ్యాన్స్ చేసిన ఆ యువతి వారికి స్నేహితురాలు అయి ఉంటుందని భావిస్తున్నారు. సోషల్ మీడియాను ఊపేసిన ఈ వీడియో చివరికి ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ అధికారుల వద్దకు చేరింది. దీంతో కన్నెర్ర చేసిన ఉన్నతాధికారులు డీటీసీకి చెడ్డపేరు తీసుకొచ్చారంటూ డ్రైవర్‌ను సస్పెండ్ చేశారు. కండక్టర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. బస్సులోని మార్షల్స్‌ను మాత్రం సివిల్ డిఫెన్స్ కార్యాలయానికి అటాచ్ చేశారు. కండక్టర్ తాత్కాలిక ఉద్యోగి కాబట్టి అతడికి షోకాజ్ నోటీసు ఇచ్చామని డీటీసీ అధికారి ఒకరు తెలిపారు. వీడియో షూటింగ్ కోసం బస్సును అనధికారికంగా వాడుకోవడం, విధుల్లో నిర్లక్ష్యం, ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేయడం, ఆర్టీసీని అప్రతిష్ఠ పాలు చేయడం వంటి ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.