
ఈ వేసవి సీజన్ లో దేశంలోనే అత్యధికంగా వడగాల్పులు వీచే డేంజర్ జోన్ లో తెలంగాణ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మే నెల రాకుండా ఎండల తీవ్రతతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ఇక, తీవ్రత పెరిగి, వడగాల్పులు వస్తే, పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రాబోయే రోజుల్లో రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ నుంచి తెలంగాణపైకి వేడి గాలులు రానున్నాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో 47 నుంచి 49 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదిలాబాద్, భద్రాచలం వంటి ప్రాంతాల్లో మరింత వేడి వుంటుందని, ఇప్పటికే సాధారణంతో పోలిస్తే 2 నుంచి 4 డిగ్రీల వరకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు.