Monday, December 16, 2019
Follow Us on :

పరమేశ్వర్ రెడ్డి పరారీ అన్నారు.. తీరా చూస్తే..!

By BhaaratToday | Published On Mar 18th, 2019

వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి పలువురి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అందులో పరమేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి గురించి కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. పరమేశ్వర్ రెడ్డి స్వస్థలం కడప జిల్లా సింహాద్రిపురం. వైఎస్ వివేకాకు సన్నిహితుడిగా పేరుపొందాడు. పరమేశ్వర్ రెడ్డిపై హత్యకేసులు ఉన్నట్టు సమాచారం. వివేకా హత్య జరిగిన రోజు నుంచి అతడు కనిపించకుండాపోయాడు. 

 పరమేశ్వర్ రెడ్డి తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కనిపించాడు. తనకు అనారోగ్యంగా ఉండడంతో మొదట కడప సన్ షైన్ ఆసుపత్రిలో చేరానని వెల్లడించాడు. అయితే తనకు వైద్యం చేస్తున్న డాక్టర్ 3 రోజులు అందుబాటులో లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం తాను తిరుపతి వచ్చానని తెలిపాడు. వివేకానందరెడ్డి హత్య కేసులో తన పేరు వినిపించడం ఆశ్చర్యం కలిగిస్తోందని, ఆయన హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. పోలీసులు అనవసరంగా తనపై నిందలు మోపుతున్నారని చెప్పుకొచ్చాడు. తన భర్త కనీసం మంచం దిగి నడవలేని స్థితిలో ఉంటే అన్యాయంగా ఆరోపణలు చేయడం సరికాదని  పరమేశ్వర్ రెడ్డి భార్య  అన్నారు. 

పరమేశ్వర్ రెడ్డికి కడప సన్ షైన్ ఆసుపత్రిలో వైద్యం చేసిన డాక్టర్ పరమేశ్వర్ రెడ్డిని కర్నూలులో చికిత్స చేయించుకోవాలని సూచించారు. అయితే పరమేశ్వర్ రెడ్డి కర్నూలు వెళ్లకుండా తిరుపతి వచ్చి సంకల్ప ఆసుపత్రిలో చేరాడు.