Monday, December 09, 2019
Follow Us on :

ధర్మంపై దాడి…హిందూ ధర్మం విచ్ఛిన్నానికి పన్నాగం

By BhaaratToday | Published On Aug 4th, 2019

మత మార్పిడులే వారి లక్ష్యం.. కాదంటే బెదిరింపుల పర్వం.. కల్వరి మిషనరీల దాష్టీకాలు అన్నీ ఇన్నీ కావు. హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం చేసేందుకు చేయని ప్రయత్నాలు లేవు. ఆలయాల పరిరక్షణే ధ్యేయంగా కృషి చేస్తున్న గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థపై కక్షగట్టి.. అంతు చూస్తామంటూ ఈమెయిల్స్  ద్వారా బెదిరిస్తున్న వైనం తాజాగా వెలుగు చూసింది. ఆ ఈ మెయిల్స్ సారాంశాన్ని చూస్తే.. హిందూ ధర్మానికి ముప్పు పొంచి ఉందని.. ముందుగా మేలుకుంటేనే కనువిప్పు కలుగుతుందని భావిస్తున్నారు హిందువులు. అసలు హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులను ఎలా ప్రతిఘటించాలి..? మతమార్పిడులకు ఎలా కళ్లెం వెయ్యాలి..? మన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి ఉన్న మార్గాలేంటి..? ఇదే ఇవాళ్టీ ధర్మపీఠం అంశం.
యుగయుగాలుగా ప్రజ్వరిల్లుతున్న హిందూ ధర్మంపై పాశ్చ్యాతుల కన్ను పడింది. ఎలాగైనా హిందుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలన్నది వారి పన్నాగం. ఒకసారి దేశ చరిత్ర చూసుకుంటే.. మనపై మహ్మదీయులు, క్రైస్తవులు దండ యాత్రలు చేసి.. విలువైన ఆధ్యాత్మిక సంపదను కొల్లగొట్టారు. లెక్కకు మించి ఆలయాలను ధ్వంసం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించినా.. మతోన్మాదుల దాడులు ఆగడం లేదు. హిందూ ధర్మాన్ని నాశనం చేసేందుకు మతమార్పిడులకు పాల్పడుతున్నాయి క్రైస్తవ మిషనరీలు. ఒకవేళ కాదంటే బెదిరించడం.. బలవంతం పెట్టడం.. లేకుంటే హతమార్చడం.. ఎంతకు తెగించైనా సరే హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయాలన్నదే వారి ఆలోచన.
ఇక విషయానికి వస్తే.. హిందూ గ్లోబల్ హేరిటెజ్ ఫౌండేషన్ సంస్థ.. అమెరికా కేంద్రంగా హిందూ ధర్మ పరిరక్షణకు పనిచేస్తోంది. ఈ సంస్థకు వెలగపూడి ప్రకాష్ రావు అనే పెద్దాయన అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ సేవ్ టెంపుల్స్.org పేరున ఓ వెబ్ సైట్ కూడా నిర్వహిస్తోంది. అంతేకాదు.. హిందూ ధర్మాన్ని పరిరక్షించడంతో పాటు శిథిలావస్థలో ఉన్న పురాతన ఆలయాలను పునరుద్ధరిస్తోంది. మన దేశ చరిత్ర, పురాణ ఇతిహాసాలు, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఆధ్యాత్మిక సౌరభాలను తమ వెబ్ సైట్ ద్వారా పదిమందికీ పంచుతూ హిందూ ధర్మాన్ని కాపాడుతోంది. అయితే.. ఈ సంస్థను నిర్వహిస్తున్న ప్రకాష్ రావుగారికి కల్వరి మిషనరీస్ సంస్థ నుంచి బెదిరింపులు మొదలయ్యాయి.

హిందూ గ్లోబల్ హేరిటేజ్ ఫౌండేషన్ సంస్థ నిర్వహిస్తున్న సేవ్ టెంపుల్స్ వెబ్ సైట్ ను వెంటనే మూసేయాలి.. హిందూ ధర్మ ప్రచారాన్ని ఆపేయాలని కల్వరి మిషనరీస్ సంస్థ అధ్యక్షుడు పాస్టర్ ఆర్.ప్రవీణ్ కుమార్ పేరిట ఉన్న ఈ మెయిల్ నుంచి బెదిరింపులు వచ్చాయి. తమ మాట వినకుంటే.. తామే వెబ్ సైట్ ను హ్యాక్ చేసి అకౌంట్ ను డెలీట్ చేస్తామని.. అంతుచూస్తామంటూ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
అటు.. తనకు వచ్చిన త్రెట్టింగ్ మెయిల్స్ ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి లేఖ ద్వారా తీసుకెళ్లారు సేవ్ టెంపుల్స్ నిర్వాహకులు ప్రకాష్ రావు. ఇదిలా ఉంటే.. కల్వరి మిషనరీస్ నుంచి వచ్చిన బెదిరింపు మెయిల్స్ తమకు తెలీదంటున్నారు ఆ సంస్థ నిర్వాహకులు. మొత్తంమ్మీద హిందూ ధర్మాన్ని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్న కల్వరి మిషనరీస్ లాంటి మతోన్మాద సంస్థలు.. ఎంతటీ దారుణానికి ఒడిగట్టేందుకైనా సిద్ధమవుతున్నాయని హిందూ ధార్మీకవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వాటిని సంఘటితంగా ఎదుర్కొకపోతే.. హిందూ ధర్మం ప్రమాదంలో పడుతుందని భావిస్తున్నారు.