Sunday, August 18, 2019
Follow Us on :

యువ‌రాజ్ విసిరిన‌ ఛాలెంజ్‌లో నెగ్గిన ధవన్

By BhaaratToday | Published On Jul 19th, 2019

ప్రపంచకప్ టోర్నీ నుంచి చేతి వేలి గాయం కారణంగా బయటకొచ్చిన శిఖర్ ధవన్.. చాలా రోజుల విశ్రాంతి తరువాత తిరిగి బ్యాట్ పట్టాడు. బ్యాట్ పట్టడమేకాదు యువరాజ్ సింగ్ విసిరిన ఛాలెంజ్‌లో గెలిచాడు. యువరాజ్ సింగ్ విసిరిన ‘బాటిల్ క్యాప్’ ఛాలెంజ్‌ను స్వీకరించిన ధవన్ తనదైన స్టైల్‌లో బ్యాట్‌తో బంతిని బాటిల్‌కు తగిలేలా ఆడి మూత కింద పడేలా చేశాడు.
 
ఈ వీడియో తన అధికార ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ధవన్.. ‘యువీ పాజీ.. ఇదిగో నా బాటిల్ క్యాప్ ఛాలెంజ్, గాయపడ్డ తరువాత మొదటిసారిగా బ్యాట్ పట్టాను. చాలా సంతోషంగా ఉందంటూ’ ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్లు ధవన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కాగా.. ప్రపంచకప్ టోర్నీలో భాగంగా జూన్ 9న ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్‌లో శిఖర్ ధవన్ ఎడమ చేతి బొటనవేలుకు గాయమైంది. దీంతో ప్రపంచకప్ ట్నోర్నీకి ధనవ్ దూరమయ్యాడు.