Tuesday, September 24, 2019
Follow Us on :

ఆ గ్లౌజులు ధ‌రించి దేశ‌భ‌క్తిని చాటిన ధోనీ

By BhaaratToday | Published On Jun 6th, 2019

దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీసేన‌ ఆరు వికెట్లతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మ్యాచ్‌లో ధోనీ వికెట్‌ కీపింగ్‌ చేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. అదేంటి.. ధోనీ వికెట్ కీపరే క‌దా.. అని అనుకుంటున్నారా.. ఐతే, ధోనీ కీపింగ్ చేస్తున్న‌ప్పుడు అత‌ను వాడిన కీపింగ్ గ్లౌజులు చూడాలి.. వాటిని గ‌మ‌నిస్తే ధోనీకి దేశంపై ఉన్న‌ అభిమానం తెలుస్తుంది. అయితే.. ఆ గ్లౌజుల‌పై భారత ఆర్మీకి చెందిన బలిదాన్‌ గుర్తు ఉండటంతో దీనిని గుర్తించిన ధోనీ అభిమానులు ఆ గ్లౌజుల ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ఇండియన్‌ ఆర్మీపై అతనికున్న అభిమానాన్ని కొనియాడుతున్నారు.

Image result for dhoni gloves

కాగా ఈ మ్యాచ్‌లో ధోనీ మిడిల్‌ఆర్డర్‌లో వచ్చి బాధ్యతాయుతంగా ఆడి 34 పరుగులు చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడంతో పాటు తొలి ఇన్నింగ్స్‌లో ఫెలుక్వాయోను స్టంపౌట్‌ చేశాడు. ఈ సందర్భంగా ధోనీ ధరించిన గ్లౌజులకు ఉన్న బలిదాన్‌ గుర్తు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ధోనీకి ఆర్మీలో చేరాలని ఎంతో ఇష్టం ఇప్పటికే ఈ విషయాన్ని అనేకసార్లు బయటపెట్టాడు. మరోవైపు పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలోనూ ధోనీ ఇలాగే చేశాడు. ఆస్ట్రేలియాతో రాంచీలో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లకి ఆర్మీ క్యాపులు అందించాడు. ఆ మ్యాచ్‌లో భారత జట్టు మొత్తం క్యాపులు ధరించి ఆడింది.