Thursday, December 12, 2019
Follow Us on :

ధోనిని ఆ జెర్సీలో చూడకూడదని తల్లిదండ్రులే అనుకుంటున్నారట..!

By BhaaratToday | Published On Jul 17th, 2019

మహేంద్ర సింగ్ ధోని.. సక్సెస్ ఫుల్ కెప్టెన్ ఆఫ్ టీమ్ ఇండియా..! అద్భుతమైన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయితే ఇటీవల వరల్డ్ కప్ లో భారత్ ఫైనల్ కు వెళ్లకపోవడంతో ధోని రిటైర్మెంట్ పక్కా అని చాలామంది చెప్పుకుంటూ వచ్చారు. సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు కూడా పెట్టుకుంటూ వచ్చారు. ధోని అభిమానులు, మాజీ క్రికెటర్లు మాత్రం అతడు ఇంకొద్ది రోజులు ఆడాలని కోరుకుంటున్నారు. 

ఇప్పటికే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని.. వన్డే, టీ20ల్లో మాత్రమే ఆడుతూ ఉన్నాడు. అయితే ధోని రిటైర్ కావాలని కోరుకుంటున్న వారిలో ధోని తల్లిదండ్రులే ఉన్నారట. ధోనిని బ్లూ జెర్సీలో చూడకూడదని అతడి తల్లిదండ్రులు అనుకుంటున్న విషయాన్ని ధోనీ చిన్నప్పటి కోచ్ కేశ‌వ్ బెన‌ర్జీ చెప్పారు. ధోనీ క్రికెట్‌ కు గుడ్‌బై చెప్పాల‌ని ఆయన త‌ల్లిదండ్రులు కోరుకుంటున్న‌ట్టు తెలిపారు. తాను వారింటికి వెళ్లి మాట్లాడానని, ఇక క్రికెట్ ను విడిచి, తమతో పాటు ఇంట్లో ఉండాల‌ని వారు భావిస్తున్నారని అన్నారు. దాదాపు 10-12 ఏళ్ళు ఆడాడు.. మరో ఏడాది ఆడి, టీ-20 ప్ర‌పంచ‌క‌ప్ త‌ర్వాత రిటైర్ మెంట్ ప్రకటిస్తే బాగుంటుందని వారికి సర్ది చెప్పానని అన్నారు. ఇప్పటి వరకూ ధోని నిర్ణయం ఏమిటో సెలెక్టర్లు కానీ.. ధోని వెల్లడించలేదు. త్వరలో జరగబోయే విండీస్ సిరీస్ కు ధోని వెళ్తాడా.. లేదా అన్నది ఇంకొద్ది రోజుల్లో తెలుస్తుంది.