Saturday, October 19, 2019
Follow Us on :

సరికొత్త చరిత్ర సృష్టించిన కోహ్లీ సేన.. ధోనీ స్పెషల్ ఇన్నింగ్స్ తో విజయం మనదే..!

By BhaaratToday | Published On Jan 18th, 2019

మూడో వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 230 పరుగుల టార్గెట్ అయినా భారత్ 49.2 ఓవర్ల పాటూ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ధోని 87 పరుగులతో నాటౌట్ గా నిలిచి భారత్ కు విజయాన్ని అందించాడు. జాదవ్ 61 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కోహ్లీ 46 పరుగులు చేశాడు. 

టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా, నిర్ణీత 50 ఓవర్ల పాటు కూడా నిలవలేకపోయింది. ఒవైపు నుంచి చాహల్ ఆసీస్ లైనప్ ను దెబ్బతీస్తూ 6 వికెట్లు సాధించిన వేళ, మరోవైపు నుంచి భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ రెచ్చిపోగా, ఆసీస్ జట్టు 48.4 ఓవర్లలోనే 230 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాట్స్ మన్లలో కారీ 5, ఫించ్ 14, ఖావాజా 34, ఎస్ఈ మార్ష్ 39, హాండ్స్ కాంబ్ 58, స్టోయిన్స్ 10, మాక్స్ వెల్ 26, రిచర్డ్ సన్ 16, జంపా 8 పరుగులు చేయగా, స్టాన్ లేక్ డక్కౌట్ అయ్యాడు. సిడిల్ 10 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 

భారత్ ఛేజింగ్ మరీ అంత ఈజీగా సాగలేదు. ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో చాలా నెమ్మదిగా భారత్ ఇన్నింగ్స్ సాగింది. 15 పరుగుల స్కోరు ఉన్నప్పుడు రోహిత్ శర్మ 9 పరుగులు చేసి వెనుదిరిగాడు.  తర్వాత ధావన్ 23 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కోహ్లీ, ధోని కలిసి ఇన్నింగ్స్  ను చక్కదిద్దారు. భారత్ స్కోరు 113 పరుగులు ఉన్నప్పుడు కోహ్లీ 46 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత ధోనితో జతకలిసిన జాదవ్ ఆసీస్ కు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. మ్యాచ్ ను చివరి వరకు తీసుకొని వెళ్లి మ్యాచ్ ను ముగించారు. ఆస్ట్రేలియాతో భారత్ ద్వైపాక్షిక సిరీస్ నెగ్గడం ఇదే మొదటిసారి. ఆరు వికెట్లు తీసిన యజువేంద్ర చాహల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.