Saturday, December 14, 2019
Follow Us on :

క్షమాపణలు చెప్పిన దినేష్ కార్తీక్..!

By BhaaratToday | Published On Sep 9th, 2019

కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో సెయింట్ కిట్స్ తో ట్రిన్ బాగో నైట్ రైడర్స్ తొలి మ్యాచ్ కు భారత క్రికెటర్ దినేష్ కార్తీక్ హాజరయ్యాడు.  షారుక్ ఖాన్ తో కలిసి దినేశ్ కార్తీక్ హాజరయ్యారు. అక్కడే ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జెర్సీ ధరించి ఆ జట్టు డ్రెస్సింగ్  రూమ్ లో కూర్చుని మ్యాచ్ వీక్షించాడు. అయితే ఇది బీసీసీఐకి నచ్చలేదు. ట్రిన్ బాగో జట్టు జెర్సీ ధరించి వారి డ్రెస్సింగ్ రూమ్ లో కనిపించడంతో బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కార్తీక్ కు బీసీసీఐ నోటీసులు జారీ చేసింది. కార్తీక్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది బీసీసీఐ. క్రమశిక్షణ ఉల్లంఘన కింద నీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో బదులివ్వాలంటూ బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ నోటీసులు పంపారు. 

దీనిపై దినేష్ కార్తీక్ స్పందించాడు. దినేశ్ కార్తీక్ తన చర్య పట్ల విచారం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ కు హాజరై, మరో జట్టు జెర్సీ ధరించడంపై క్షమాపణలు కోరాడు. బీసీసీఐ అనుమతి లేకుండా సీపీఎల్‌కి వెళ్లడం పొరపాటేనని.. అందుకు బేషరుతుగా క్షమాపణలు కోరుతున్నానని.. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్టుకి సంబంధించి ఎలాంటి విషయాల్లో జోక్యం చేసుకోనని.. దినేష్ కార్తీక్ బీసీసీఐకి క్షమాపణ లెటర్ రాశాడు. ఇకపై వారి డ్రెస్సింగ్ రూంకి వెళ్లి మ్యాచ్‌లు చూడనంటూ బీసీసీఐ తెలిపాడు కార్తీక్.