Tuesday, October 15, 2019
Follow Us on :

నమ్ముతారో.. నమ్మరో.. దినేష్ మోంగియా రిటైర్మెంట్ ప్రకటించాడు..!

By BhaaratToday | Published On Sep 19th, 2019

దినేశ్ మోంగియా.. 2003 వరల్డ్ కప్ చూసిన వాళ్లకు ఈ పేరు బాగా పరిచయమే..! మోంగియా క్రికెట్ ఆడక చాలా రోజులే అయింది.. రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత జట్టు తరపున ఆడి దాదాపు 12 ఏళ్ళు పైనే అయింది. తాజాగా దినేశ్ మోంగియా అన్ని ఫార్మాట్ల  క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 

2001లో అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌ను ఆరంభించాడు. 2002లో గౌహతి వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 159 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. భారత జట్టు తరఫున అతడు 57 వన్డేలు ఆడాడు. వన్డేల్లో 27.95 యావరేజితో 1,230 పరుగులు చేశాడు. 14 వికెట్లు తీశాడు. ఇక, 121 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో అతను 21 సెంచరీలు చేశాడు. భారత తరఫున ఒక్క టెస్టు మ్యాచ్‌ కూడా ఆడలేదు. లాంకషైర్, లైచెస్టర్‌షైర్ తరఫున అతను కౌంటీ క్రికెట్ కూడా ఆడాడు. 

Image result for Dinesh Mongia

1995లో పంజాబ్‌ తరఫున అండర్‌-19 జట్టులో అరంగ్రేటం చేసిన దినేశ్ మోంగియా చివరగా 2007లో ఇండియన్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్‌లో పంజాబ్ జట్టు తరఫున తన చివరి మ్యాచ్‌ని ఆడాడు.  2003 వన్డే వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచి భారత జట్టులో దినేశ్‌ సభ్యుడిగా ఉన్నాడు. భారత్‌ తరఫున 2007లో తన ఆఖరి వన్డే ఆడాడు. 2006లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 

Image result for Dinesh Mongia