Thursday, December 12, 2019
Follow Us on :

ఈ వార్త‌ నిజ‌మేనా స‌ర్.. ఆ వార్త‌ల్లో నిజం లేదు

By BhaaratToday | Published On Jul 17th, 2019

గ‌త‌ రెండు, మూడు రోజులుగా హైదరాబాద్ నగరంలో ఇంకో 48 రోజుల తర్వాత నీరు ఉండదనే వార్తలు సోషల్ మీడియాలో బాగా హడావుడి చేస్తున్నాయి.  భూగర్భ జలాలు ఎండిపోవడం కార‌ణంగా, రిజర్వాయర్లలో నీరు వచ్చి చేరే పరిస్థితి లేకపోవడంతో తీవ్రమైన నీటి ఎద్దడి తప్పదని, చెన్నై నగరం మాదిరిగా హైదరాబాద్ ప్ర‌జ‌లు కూడా కరువును ఎదుర్కోవాల్సి వస్తుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో హైద్రాబాదీ జనాల్లో  కంగారు మొదలైంది.  

అయితే ఈ వార్త‌ల‌పై సినీ దర్శకుడు మారుతి సైతం స్పందిస్తూ.. ఈ వార్త నిజమేనా సర్.. అంటూ ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌ను అడిగారు. దీనికి స్పందించిన కేటీఆర్.. ఆ వార్తల్లో నిజం లేదు. ఇంకో రెండు వారాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి నీరు ఎల్లంపల్లి రిజర్వాయర్‌లోకి వస్తుంది. దీని ద్వారా హైదరాబాద్‌కు రోజుకు 172 మిలియన్‌ గ్యాలన్ల నీరు అందుతుందని.. ప్రజలు కూడా నీటి ప్రాముఖ్యతను గుర్తించి జాగ్రత్తగా వాడుకోవాలి అన్నారు.