Wednesday, October 16, 2019
Follow Us on :

భారత ఆర్మీలో ఉన్న పంజాబీ సైనికుల గురించి పాకిస్థాన్ మంత్రి చెత్త వ్యాఖ్యలు

By BhaaratToday | Published On Aug 14th, 2019

భారత ఆర్మీలో ఉన్నదంతా భారతీయులే.. మతాలు, ప్రాంతాల వారీగా విడదీయాలని ఎందరు అనుకున్నా అది జరగలేదు. ఇప్పుడు పాకిస్థాన్ మంత్రులు కూడా భారత సైన్యం గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. 

చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను ఇండియన్ ఆర్మీలో ఉన్న సైనికులు వ్యతిరేకించాలని... కశ్మీర్ లో విధులు నిర్వహించవద్దంటూ ఇండియన్ ఆర్మీలో ఉన్న పంజాబీ సైనికులను ఉద్దేశించి పాకిస్థాన్ మంత్రి ఫవాద్ చౌదరీ హుస్సేన్ ట్వీట్ చేశారు. 

Image result for pakistan minister fawad chaudhry

 అతడు చేసిన ఈ చెత్త వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ ఫైర్ అయ్యారు.  పంజాబీ సైనికులకు మీ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కశ్మీర్ లో పంజాబీ సైనికులు విధులు నిర్వహించవద్దంటూ పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలు వారి నిరాశను తెలియజేస్తున్నాయి. పంజాబీలు దేశభక్తులు. దేశం వరకు వస్తే వారికి త్యాగాల కంటే ఎక్కువ మరేదీ లేదని అన్నారు.

ఆమె అలా మాట్లాడినా కూడా ఫవాద్ బుద్ధి మారలేదు. కర్తార్ పూర్ దారిని తెరిచేటప్పుడు మిమ్మల్ని చూడాలనుకుంటున్నాని, మోదీ సర్కార్ వెస్ట్ ఇండియా కంపెనీకి వత్తాసు పలకొద్దని అన్నారు. అక్కడితో ఆగని ఫవాద్ మహారాజా రంజిత్ సింగ్ భూమిని ఆక్రమించుకునేందుకు మోదీ చేసే ప్రయత్నాలను సఫలీకృతం కానివ్వబోమని అన్నారు.