Thursday, October 17, 2019
Follow Us on :

దూకుడు సినిమా విల‌న్ అరెస్ట్.. విద్వేషాలు రెచ్చగొట్టేలా..

By BhaaratToday | Published On Jul 19th, 2019

బాలీవుడ్‌​ నటుడు మ‌రియు బిగ్‌బాస్ కంటెస్టంట్ అజాజ్‌ ఖాన్‌ను ముంబాయి సైబర్‌ పోలీసులు అరెస్టు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్న అభ్యంతరకర వీడియోలను అజాజ్‌ ఖాన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఈ క్రమంలో కొద్ది క్షణాల్లోనే ఆ వీడియోలు వైరల్‌ కావడంతో అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉందంటూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో వెంటనే అజాజ్‌ ఖాన్‌ ఇంటికి చేరుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇదిలావుంటే.. అజాజ్‌ ఖాన్ గతంలో కూడా అనేకమార్లు అరెస్టయ్యాడు. 2016లో ఓ బ్యూటీషియన్‌ను లైంగికంగా వేధించిన కేసులో పోలీసులు అతడిని అరెస్టు చేయగా... 2018లో డ్రగ్స్‌ కేసులో ముంబై యాంటీ- నార్కోటిక్స్‌ పోలీసుల చేతికి చిక్కాడు. ఇక హిందీ బిగ్‌బాస్‌-7 సీజన్‌లో పాల్గొన్న అజాజ్‌ ఖాన్‌.. పలు బాలీవుడ్‌ సినిమాలతో పాటు దూకుడు, బాద్‌షా, హార్ట్ ఎటాక్‌, నాయక్‌, టెంపర్‌ వంటి తెలుగు చిత్రాల్లో విల‌న్‌గా నటించాడు.