Friday, December 13, 2019
Follow Us on :

అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం బీఆర్ అంబేద్కర్

By BhaaratToday | Published On Apr 14th, 2019

అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం. అగ్రకుల దురహంకారంపై గొంతెత్తిన స్వరం… భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్. ఈ రోజు ఆయన 128వ జయంతి. 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్ లోని మోవ్ గ్రామంలో జన్మించారు. పూర్తి పేరు భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్. చదువుకోవాలన్నా…మంచినీళ్ళు తాగాలన్నాకులమే అడ్డుగా నిలబడింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. సమాజంలో వర్ణ, వర్గభేదాలు ఉండొద్దని రాజ్యాంగాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఎందరికో ఆరాధ్యుడయ్యారు. 

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు, రాజ్యాంగాన్ని రచించి ప్రజలకు కావాల్సిన అవసరాలను, హక్కులను తెలిపిన గొప్ప మహా నాయకుడు. ప్రజలకు రిజర్వేషన్లు, హక్కులు కల్పించిన గొప్ప నాయకుడు అంబేద్కర్, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరెవరికీ ఎంత రిజర్వేషన్ల ప్రకారం వేతనాలు తీసుకోవాలో, సమాజంలో ఎలా నడుచుకోవాలో, రాజ్యాంగంలో క్లుప్తంగా రచించి ప్రజలకు అందించిన గొప్ప మహనీయుడు. అంబేద్కర్‌ విభిన్న అంశాలపై ఎంతో విస్తృతంగా రచనలు చేశారు. 'ప్రజాస్వామ్యం', 'అంటరానితనం', 'కుల నిర్మూలన', 'మతమార్పిడి', 'బౌద్ధమతం', 'హిందూమతంలోని చిక్కుముడులు', 'ఆర్థిక సంస్కరణలు-దళితులు', 'భారతదేశ చరిత్ర' మొదలైన వాటిపై ఆయన రచనలు ఎంతో ప్రఖ్యాతి చెందాయి. అంబేడ్కర్ భారతీయ సామాజిక వ్యవస్థను మార్చడం కోసం జీవితాంతం కృషి చేశారు. కులవ్య వస్థను రద్దు చేయడానికి కులనిర్మూలనను ప్రతిపాదించారు. కులం ఒక పెట్టుబడిగా, అదనపు సంపదగా, అదనపు విలువగా, అధికార కేంద్రంగా ఉందని స్పష్టం చేయడం ద్వారా అంబేడ్కర్ కులాన్ని కూడా అర్థశాస్త్రంలో భాగంగా చర్చించారు

తెలుగునాట మొదటిసారిగా అంబేడ్కర్‌ను సాహిత్యంలో ప్రస్తావించిన ఘనత మహాకవి గుర్రం జాషువాకే దక్కుతుంది. 1947లో వెలువరించిన ఆయన కావ్యం గబ్బిలంలో ‘జంబేడ్కరుండు సహోదరుండు’ అనే పద్యంలో గబ్బిలాన్ని అంబేడ్కర్ దీవెనలు అందుకోమంటారు. అప్పటి నుండి తెలుగు సాహిత్యంలో అంబేడ్కర్ శాశ్వత స్థానం సంపాదించుకున్నాడు. 

బాబాసాహెబ్ ప్రత్యేకతలు - దక్కిన గౌరవాలు  
బాబాసాహెబ్ తన జీవిత కాలంలో 527 ప్రసంగాలు చేసారు., ప్రతి ప్రసంగం అత్యంత ప్రభావితం చేయగలిగేవే. లండన్ యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు మొత్తం చదివి అవపోసన పట్టిన ఒకే ఒక్కరు బాబాసాహెబ్. ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావశీలురైన 6గురు మేధావులలో బాబాసాహెబ్ ఒకరు. లండన్ విశ్వవిద్యాలయంలో తన ఎనిమిదేళ్ళ Phd ని మూడు సంవత్సరాలలో పూర్తి చేసిన అత్యంత మేధావి.