Sunday, December 15, 2019
Follow Us on :

ఇదిగో చంద్రయాన్-2 తీసిన భూగ్రహం ఫోటోలు…విడుదల చేసిన ఇస్రో

By BhaaratToday | Published On Aug 4th, 2019

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇటీవల చంద్రయాన్-2ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. చంద్రయాన్ 2 ప్రయోగించినప్పటి నుంచి శాస్త్రవేత్తలు వాహన నౌక కక్ష్యను పెంచుకుంటూ ఇంధనాన్ని మండించారు. అయితే చంద్రుడి దక్షిణ ధ్రువంవైపు ప్రయోగాలు చేపట్టేందుకు వీలుగా ఇందులో ల్యాండర్, రోవర్, ఆర్బిటర్ లను ఇస్రో పంపింది. ప్రస్తుతం భూమి చుట్టూ కక్ష్యను పెంచుకుంటూ పరిభ్రమిస్తున్న చంద్రయాన్-2 వాహక నౌక ఆగస్టు 14న భూ కక్ష్యను దాటి చంద్రుడివైపు దూసుకపోనుంది. ఈ నేపథ్యంలో చంద్రయాన్-2లోని ఎల్ఐ4 కెమెరా తీసిన భూగ్రహం ఫొటోలను ఇస్రో ఈరోజు విడుదల చేసింది. ఈ ఫొటోల్లో భూమి నీలం రంగులో మెరిసిపోతోంది. వీటిని మీరూ చూసేయండి.