Thursday, September 19, 2019
Follow Us on :

యోగి ఆదిత్యనాథ్ 72గంటలు ప్రచారం చేయకూడదట.. ఎందుకంటే..?

By BhaaratToday | Published On Apr 15th, 2019

ఎన్నికల ప్రచారంలో నాయకులు ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎన్నికల సంఘం ఆ నాయకులపై కొరడా ఝుళిపిస్తుంది. అయితే అనుచిత వ్యాఖ్యలు చేశారని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.  మతపరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఎలక్షన్‌  కోడ్‌ను ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. యోగి ఆదిత్యనాథ్ కు మూడు రోజులు (72 గంటల పాటు) పాటు ఎన్నికల  ప్రచారం నుంచి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఎలక్షన్ కమీషన్. ఇక బిఎస్పీ అధినేత్రి మాయావతిపై కూడా నిషేధాన్ని విధించారు. రెండు రోజులు (48 గంటల పాటు) మాయావతిని ఎన్నికల ప్రచారం నుంచి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.

Image result for mayawati

భారత ఆర్మీ జవాన్లను ‘మోడీ సేన’గా యోగి ఆదిత్యనాథ్ ఘజియాబాద్ ఎన్నికల సభలో చేసిన వ్యాఖ్యలకు విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. ఈ నేపథ్యంలో ఈసీ ఆయనపై ఈ చర్యలు తీసుకుంది.