Monday, December 09, 2019
Follow Us on :

దేశ సమైక్యతా యజ్ఞంలో సమిధ 'డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ'

By BhaaratToday | Published On Jul 6th, 2019

భారతదేశ చరిత్రలో జమ్మూకశ్మీర్ రాష్ర్టానిదొక విషాదగాథ. ఈ విషాధగాధలో ఆనాటి ప్రతిపక్ష నేత...భారతీయ జన సంఘ్ అధ్యక్షుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదానం కూడా ఒక విషాద ఘట్టం. ఆ రోజుల్లో జమ్మూకశ్మీర్ కు భారత పౌరులు వెళ్లాలంటే వారికి వీసా లాంటి పర్మింట్ అవసరం ఉండేది. ఆ పర్మింట్ ఉంటేనే ఆ రాష్ర్టంలో భారత పౌరులకు ప్రవేశం లభించేది. లేకపోతే అంతే అరెస్టు చేసి జైల్లో పెట్టేవారు. అంతేకాదు ఆ రాష్ర్ట ముఖ్యమంత్రిని... ప్రధానమంత్రిగా పిలిచేవారు. ఇంకా ఆ రాష్ర్టానికి ప్రత్యేకంగా జెండా, ప్రత్యేక రాజ్యాంగం ఏర్పాటు చేశారు. నెహ్రూ కశ్మీర్ విధానాలతో దేశ సమగ్రతకే పెను సంభవించిన వేళా....శ్యాంప్రసాద్ జీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఏక్ దేశ్ మే దో ప్రధాన్.., ఏక్ దేశ్ మే దో నిశాన్.., ఏక్ దేశ్ మే దో విధాన్ నహీ చలేంగే నహీ చలేంగే అంటూ... పర్మింట్ లేకుండా జమ్మూకశ్మీర్ లో ప్రవేశించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ... మళ్లీ తిరిగి రాలేదు.  

కశ్మీర్ పై పాక్ దురాక్రమణ చేసినప్పుడు కశ్మీరీలను వారి ఖర్మానికి వదిలేసి...సకుటుంబ సమేతంగా గ్వాలియర్ కు పారిపోయిన ఘటనుడు షేక్ అబ్దుల్లా...!భారత సైన్యం... పాక్ సేనలను తరిమికొట్టిన తర్వాతనే ఆయన శ్రీనగర్ లో అడుగు పెట్టాడు. అది కూడా భారత సైనికుల రక్షణలోనే.   అడుపెట్టాడు. ఆ వెంటనే స్వతంత్ర కాశ్మీర్ అనేది తన జీవన స్వప్నమని ప్రకటించిన కృతఘ్నుడు..! రాజా హరిసింగ్ ను కాదని...ద్రోహి అయిన షేక్ అబ్దుల్లాను నెహ్రూ సంపూర్ణంగా విశ్వసించాడు. 

జమ్మూకశ్మీర్ ను భారత యూనియన్ లో విలీనం చేసింది రాజా హరిసింగ్. అది కూడా దేశంలో మిగిలిన సంస్థానాల మాదిరిగానే ఆయన కూడా తన రాజ్యాన్ని విలీనం చేస్తున్నట్లు సంతకం చేశాడు. ఆ తర్వాతే పండిట్ నెహ్రూ షేక్ అబ్దుల్లాకు....జమ్మూకశ్మీర్ రాష్ర్టానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు కట్టబెట్టాడు.  ఇంకేం భారత్ యూనియన్ లో విలీనం తర్వాత కూడా తానోక స్వతంత్ర రాజ్యానికి ప్రధానమంత్రి అన్నట్లుగా వ్యవహారించాడు షేక్ అబ్దుల్లా. భారత ప్రభుత్వ ప్రతినిధి జనరల్ గా ఉన్న జస్టిస్ కన్వర్ దిలీప్ సింగ్....షేక్ అబ్దుల్లా ఆగడాలను ఎప్పటికప్పుడు ఢిల్లీలోని నెహ్రూకు చేరవేశారు కూడా. అయితే దేశభద్రత దృష్ట్యా అబ్దుల్లా ఆగడాలను అర్థం చేసుకోవాల్సిన...దిలీప్ సింగ్  పైనే దురుసుగా ప్రవర్తించాడు. దాంతో ఆయన పదవికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత కశ్మీర్ సంస్థానానికి ప్రధానిగా పనిచేసిన మెహర్ చంద్ మహాజన్ వంతు వచ్చింది. ఆయన్ను సైతం అత్యంత అవమానకరమైన పద్ధతిలో కశ్మీర్ నుంచి వెళ్లగొట్టాడు షేక్ అబ్దుల్లా. ఈ మెహర్ చంద్ మహాజనే...జమ్మూకశ్మీర్ ను భారత యూనియన్ లో విలీనం చేసేందుకు ఎంతగానో కృషి చేశాడు. 

కశ్మీర్ లో దేశభక్తి కలిగిన నాయకత్వమే లేకుండా చేయడంతోపాటు...ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని ఇస్లామీకరణ చేశాడు షేక్ అబ్దుల్లా. జమ్మూకశ్మీర్ లో భాగమైన జమ్మూ ప్రాంతాన్ని అన్నివిధాలుగా వివక్షతకు అణిచివేతలకు గురి చేశాడు. జమ్మూలో హిందువులు..., సిక్కులు మెజారీటి సంఖ్యలో ఉంటారు.  షేక్ అబ్దుల్లా చేస్తున్న ఈ దేశవ్యతిరేక విధానాలను నిరసిస్తూ పండిత ప్రేమనాథ డోగ్రా ప్రజా పరిషత్ సంస్థను ఏర్పాటు చేశారు. జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి అవసరం లేదని...కశ్మీర్ ను సంపూర్ణంగా భారత్ లో విలీనం చేయాలనే డిమాండ్ తో ప్రజా పరిషత్ నేతృత్వంలో జమ్మూ ప్రజలు ఉద్యమించారు. 

అయితే నెహ్రూ...షేక్ అబ్దుల్లా ప్రజా పరిషత్ ను తీవ్రంగా దూషించేవారు. ప్రజా పరిషత్ ఆందోళలను అణిచివేసేందుకు ప్రజాస్వామ్య వ్యతిరేక, నిరంకుశ చర్యలకు పాల్పడ్డాడు షేక్ అబ్దుల్లా. ప్రేమనాథ డోగ్రాను ఆయన సహచరులను అక్రమంగా నిర్భించి జైల్లో పెట్టించాడు. 1948 అక్టోబర్ లో జమ్మూ నుంచి వచ్చిన ప్రజా పరిషత్ బృందం...శ్యాం ప్రసాద్ ముఖర్జీని తొలిసారి కలుసుకుంది. జాతీయ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నారు. 

1949లో జమ్మూ కశ్మీర్ రాష్ర్టంలో రాజ్యాంగ సభ ఏర్పాటు చేయడానికి ఎన్నికలు నిర్వహించాలని షేక్ అబ్దుల్లా ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్యాంగ సభ ఏర్పాటు తర్వాత జమ్మూకశ్మీర్ విలీనంపై అంతిమ నిర్ణయం తీసుకుంటుందని అబ్దుల్లా ప్రకటించాడు.  తన అనుంగు శిష్యులు మాత్రమే రాజ్యాంగ సభకు ఎన్నికయ్యేటట్లుగా కుట్రచేశాడు షేక్ అబ్దుల్లా. వారి ద్వారానే కశ్మీర్ స్వతంత్ర రాజ్యామని ప్రకటింపచేయాలన్నది అతని వ్యూహం. ఈ కుట్రను వమ్ము చేయాలని ప్రజా పరిషత్ నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ సభలో ఎన్నికల్లో 59 మంది ప్రజా పరిషత్ సభ్యులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రజా పరిషత్ కు జమ్మూలో ప్రాబల్యం ఉండంటంతో దాదాపు అందరూ ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇక్కడే షేక్ అబ్దుల్లా కుట్రతో 59 నామినేషన్లలో 42 నామిషేన్లను ఏవో కారణాలు చూపి ప్రభుత్వంలో అధికారులైన ఎన్నికల అధికారుల ద్వారా తిరస్కరింపచేశాడు.  

ఈ విషయాన్ని ఢిల్లీలోని జాతీయ నాయకులందరికి వివరించేందుకు స్వయంగా పండిత ప్రేమనాథ డోగ్రా ఢిల్లీకి వచ్చారు. అయితే జాతీయ నాయకుల ప్రతిస్పందన ఆయనకు నిరాశ కలిగించింది. దాంతో ప్రజా పరిషత్ కశ్మీర్ రాజ్యాంగ సభ ఎన్నికలకు దూరంగా ఉంది. మరో వైపు నెహ్రూపై ఒత్తిడి తెచ్చి రాజ్యాంగంలో కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ 370 అధికరణం చేర్చబడింది. దీనిపై పార్లమెంటులో  మాట్లాడిన నెహ్రూ ఇది తాత్కాలికమైందని...దానంతట అదే తొలగిపోతుందని ప్రకటించారు. అయితే ఈనాటికి వరకు అది యథాతథంగా కొనసాగుతూనే ఉంది. అంతేకాదు భారత వ్యతిరేక శక్తులకు ఇప్పుడు ఇదే ఆయుధంగా మారింది. 

షేక్ అబ్దుల్లాకు 370 అధికరణం భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఒక లైసెన్స్ అయ్యింది. కశ్మీర్ రాజ్యాంగ సభ ద్వారా కశ్మీర్ కు ఒక ప్రత్యేక రాజ్యాంగం రూపొందింది. తన పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ జెండానే  కశ్మీర్ జాతీయ పతాకంగా గుర్తించారు. భారత రాజ్యాంగంగానీ, భారత ప్రభుత్వం చేసే చట్టాలు...అబ్దుల్లా ప్రభుత్వం ఆమోదిస్తేనే కశ్మీర్ లో అమలు జరిగే పరిస్థితి ఏర్పడింది. దేశంలోపల దేశంగా కశ్మీర్ ఆవిర్భవించింది. 

1952 ఫిబ్రవరిలో జమ్మూలోని ప్రభుత్వ గాంధీ మెమోరియల్ కాలేజీ విద్యార్థులకు ఒక అధికార ఉత్సవంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ పతాకానికి వందనం చేసేందుకు విద్యార్థులు  నిరాకరించారు. దాంతో విద్యార్థులపై ప్రభుత్వం క్రూరంగా వ్యవహరించింది. ఇది జమ్మూలో ప్రజా ఉద్యమానికి దారితీసింది. 70వ దశకంలో ఉన్న పండిత ప్రేమనాథ డోగ్రాను కశ్మీర్ ప్రభుత్వం  అరెస్టు చేసింది.  

జమ్మూలో షేక్ అబ్దుల్లా అణిచివేత చర్యల వార్తలు దేశమంతటా వ్యాపించసాగాయి. ఇది పార్లమెంటులో కూడా ప్రతిధ్వనించసాగింది. కశ్మీర్ లో నిర్మాణమవుతున్న పరిస్థితులు శ్యాంప్రసాద్ ముఖర్జీని తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. అచంచల దేశభక్తితో జమ్మూ ప్రజలు పోరాటం చేస్తున్నా కూడా ప్రధాని నెహ్రూ పట్టించుకోకపోవడం ఆయన హృదయాన్ని కలిచివేశాయి. 

-వ‌న‌క‌ళ్ల బీర‌ప్ప కురుమ‌