Sunday, August 18, 2019
Follow Us on :

హోళికా దహనం కాదు.. ఆ రాక్షసుడి దహనం

By BhaaratToday | Published On Mar 20th, 2019

హోళీ పండుగ సందర్భంగా హోళికా దహనం జరుపుతారు. అయితే ఈ ఏడాది పూణే వాసులు హోళికా స్థానంలో జైషే మొహమ్మద్ ఛీఫ్ మసూద్ అజర్ ల దిష్టి బొమ్మలను రాక్షసుడిగా ఉంచి దహనం చేయనున్నారు. మసూద్ అజర్, హఫీజ్ సయీద్ లకు సంబంధించిన దిష్టిబొమ్మలను పూణేలోని పలు వీధుల్లో ఉంచారు. వాటిని హోళికా దహనం కార్యక్రమంలో ఉపయోగించనున్నారు. మసూద్ అజర్, హఫీజ్ సయీద్ లు భారత్ మీదకు తీవ్ర వాదాన్ని ఉసిగొల్పుతున్న సంగతి తెలిసిందే. ఈ రాక్షసులను భారత్ కు అప్పగించేలా పాకిస్థాన్ మీద అంతర్జాతీయంగా ఒత్తిడులు వస్తున్నాయి.     


ఇక జైషే మ‌హ్మ‌ద్ ఉగ్ర‌వాద సంస్థ చీఫ్ మ‌సూద్ అజ‌ర్‌ను అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టించాల‌ని యురోపియ‌న్ యూనియ‌న్‌లో జ‌ర్మ‌నీ ప్ర‌తిపాదించింది. ఇటీవ‌ల ఐక్య‌రాజ్య‌స‌మితిలో ఆ ప్ర‌య‌త్నాన్ని చైనా అడ్డుకున్న విష‌యం తెలిసిందే. అజ‌ర్‌ను గ్లోబ‌ల్ టెర్ర‌రిస్టుగా ప్ర‌క‌టించేందుకు ఈయూ దేశాల‌తో జ‌ర్మ‌నీ సంప్ర‌దింపులు జ‌రుపుతోంది. ఈ నిర్ణ‌యం వ‌ల్ల ఉగ్ర‌వాది అజ‌ర్‌పై ట్రావెల్ బ్యాన్ విధిస్తారు. 28 ఈయూ దేశాల్లో ఉన్న అత‌ని ఆస్తుల‌ను జ‌ప్తు చేస్తారు. అయితే జ‌ర్మ‌నీ ప్ర‌తిపాద‌న చేసినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి తీర్మానం తీసుకోలేద‌ని తెలుస్తోంది.