Thursday, September 19, 2019
Follow Us on :

పక్కా ప్లాన్ ప్రకారం అప్పట్లో.. చోటా రాజన్ కు ఎనిమిదేళ్ళ జైలు శిక్ష..!

By BhaaratToday | Published On Aug 21st, 2019

గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ కు ప్రముఖ వ్యాపారవేత్త, హోటల్ యజమాని బీఆర్ శెట్టి హత్యాయత్నం కేసులో ఎనిమిదేళ్ళ జైలు శిక్ష పడింది. 2012 లో చోటుచేసుకున్న ఈ హత్యను విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు చోటా రాజన్ కు ఎనిమిదేళ్ల జైలు శిక్షను విధించడమే కాకుండా  నిందితులు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల జరిమానా విధించింది. ఈ కేసులో షార్ప్ షూటర్ రోహిత్ తంగప్ప, నిత్యానంద్ నాయక్, సెల్విన్ డేనియల్, దిలీప్ ఉపాధ్యాయ్, తల్విందర్ సింగ్ భక్షి, గురుదీప్ సింగ్ నిందితులుగా ఉన్నారు. గురుదీప్ సింగ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు.  

పక్కా ప్లాన్ ప్రకారం అప్పట్లో హోటల్ యజమానులు, భవన నిర్మాణదారులలో భయాందోళనలను పెంచేందుకు ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.