Thursday, December 05, 2019
Follow Us on :

బ్రేకింగ్‌: ఏపీ చీఫ్ సెక్ర‌ట‌రీ అనిల్ చంద్ర పునేఠా బ‌దిలీ

By BhaaratToday | Published On Apr 5th, 2019

ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వానికి ఈసీ మరో షాక్ ఇచ్చింది. ఏపీ చీఫ్ సెక్రటరీ అనిల్ చంద్ర పునేఠా పై బదిలీ వేటు వేసింది. ఎన్నికల విధుల నుంచి పునేఠాను తొలగించింది. ఏపీకి కొత్త సీఎస్ గా ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియ‌మించింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఎస్ గా కొనసాగనున్నారు. పునేఠాను ఎన్నికల విధులకు సంబంధంలేని శాఖలో నియమించాలని ఆదేశాల్లో పేర్కొంది. 1983 బ్యాచ్‌కకు చెందిన ఎల్వీ.. శనివారం ఉదయం 10 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు.