Thursday, December 05, 2019
Follow Us on :

కాల్పులకు తెగబడ్డ ఉగ్రమూకలు.. ఇద్దరిని మట్టుబెట్టిన భద్రతా బలగాలు

By BhaaratToday | Published On Apr 13th, 2019

జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆ జిల్లాలోని గహంద్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందుకున్న భద్రతా బలగాలు శనివారం ఉదయం నుంచి నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. దీంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ సోదాల్లో 34 ఆర్‌ఆర్, ఎస్‌ఓజీ బృందాలు పాల్గొన్నట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. హతమైన ఉగ్రవాదుల వివరాలు, వారు ఏ ఉగ్ర సంస్థకు చెందారన్న విషయం తెలియాల్సి ఉంది. ఇటీవల ఇదే జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరగగా, ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్‌ ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ ఘటన మరకవ ముందే మరోసారి షోపియాన్‌లో ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది.