Friday, December 06, 2019
Follow Us on :

ఇంగ్లండ్ ఎదుట స్వల్ప లక్ష్యం.. ఎవ‌రు గెలిచినా..

By BhaaratToday | Published On Jul 14th, 2019

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ 241 పరుగులు చేసి ఆతిథ్య ఇంగ్లండ్ ఎదుట 242 పరుగుల స్వల్ప విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌ను ఇంగ్లండ్‌ బౌలర్లు తొలి నుంచే కట్టడి చేశారు. ముఖ్యంగా క్రిస్ వోక్స్, లియామ్ ప్లంకెట్‌లు మూడు వికెట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో పరుగులు రావడం కష్టంగా మారింది. హెన్రీ నికోలస్ 55, విలియమ్సన్ 30, టామ్ లాథమ్ 47 పరుగులతో రాణించారు. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ఫైన‌ల్‌లో ఎవ‌రు గెలిచినా మొద‌టిసారి క‌ప్ సాధించిన‌ట్టే కావ‌డంతో పోరు హోరాహోరి అవ‌నుంది.