Thursday, December 05, 2019
Follow Us on :

ముగిసిన వ‌ర‌ల్డ్‌క‌ప్ పోరు....విజేతగా నిలిచిన ఇంగ్లండ్‌

By BhaaratToday | Published On Jul 15th, 2019

నెలరోజులకు పైగా వరల్డ్ కప్ సమరం ముగిసింది. 10 జట్లు పాల్గొన్న ఈ వన్డే క్రికెట్ పోరులో ఇంగ్లండ్‌ జట్టు జగజ్జేతగా నిలిచింది. వన్డే క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్‌ విజేతగా నిలవడం ఇదే మొద‌టిసారి. 1979, 1987, 1992లో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న ఇంగ్లండ్‌ ఎట్ట‌కేల‌కు ఈసారి కప్ లాక్కెల్లింది. 45 ఏళ్ల ఇంగ్లండ్‌ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఆ జట్టు చిరకాల స్వప్నం నెరవేరింది. నాలుగున్నర దశాబ్దాల వరల్డ్‌కప్‌ చరిత్రలో మూడుసార్లు ఫైనల్‌కు చేరినా ఎన్నడూ ట్రోఫీని ముద్దాడని ఇంగ్లండ్‌ జట్టు ఆశ, ఆ దేశ అభిమాని ఆకాంక్ష తీరిపోయింది. ఇంగ్లండ్‌ జట్టు విశ్వవిజేతగా నిలిచింది.


తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 241 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ కూడా 50 ఓవర్లలో 241 రన్స్ చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. దీంతో ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ సూపర్ ఓవర్లో ఫస్ట్ ఇంగ్లండ్‌ బ్యాటింగ్ చేసింది. ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. కూడా ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. అయితే, ఇంగ్లండ్‌ ప్రపంచకప్ విజేత అంటూ ఐసీసీ ప్రకటించింది.

అయితే ప్రపంచ కప్ వీక్షిస్తున్న కోట్లాది ప్రేక్షకులకు అసలు విషయం ఎంటో అర్ధం కలేదు. రెండు సార్లు రెండు జట్లు సేమ్ స్కోర్ చేశాయి. మ్యాచ్ టై అవ్వాలి కదా.. అనుకున్నారు. ఇద్దరినీ కలిపి విజేతగా ప్రకటిస్తారని ఆశించ‌గా, కానీ ఐసీసీ అందరికీ షాక్ ఇచ్చేలా ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించింది.