Wednesday, October 16, 2019
Follow Us on :

రాజ‌కీయ భ‌విత‌వ్యంపై కీల‌క వ్యాఖ్య‌లు చేసిన స‌బ్బం హ‌రి

By BhaaratToday | Published On Feb 23rd, 2019

త‌న రాజ‌కీయ భ‌విత‌వ్యంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఏపీ మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి. గత కొంతకాలంగా ఏపీలోని టీడీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో తన ముందు రెండే దారులు ఉన్నాయని, అందులో ఒకటి టీడీపీలో చేరడం, రెండోది రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకోవడ‌మేన‌ని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఆవగింజ అంత అయినా సాయం చేయాలని ఉందని, పోలవరంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాల నుంచి కేంద్రానికి డబ్బులు వెళ్తాయని, పోలవరం విషయంలో కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు.  ప్రభుత్వ పరంగా రాజధానికి అవసరమైనదంతా చంద్రబాబు చేస్తున్నారని సబ్బం హరి పేర్కొన్నారు.