Tuesday, October 15, 2019
Follow Us on :

మాజీ ఎంపీ, సినీ నటుడు శివప్రసాద్‌ కు తీవ్ర అస్వస్థత..!

By BhaaratToday | Published On Sep 19th, 2019

చిత్తూరు మాజీ ఎంపీ, సినీ నటుడు శివప్రసాద్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది రోజుల క్రితమే ఆయన అస్వస్థతకు గురవ్వడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంచగా  ఆయన ఇటీవలే కోలుకున్నారని అనుచరులు తెలిపారు. కానీ ఇప్పుడు మరోసారి ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. 

కొద్ది రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో చెన్నైలోని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ కొన్ని రోజులు చికిత్స తీసుకున్న అనంతరం ఇంటికి తీసుకువచ్చారు. ఆయనకు కిడ్నీ సంబంధిత వ్యాధి మళ్లీ తిరగదోడడంతో ఈరోజు  ఉదయం కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.

Image result for mp siva prasad