Wednesday, October 16, 2019
Follow Us on :

ఎఫ్-2 సంక్రాంతి విన్నర్.. వినయ విధేయ రామ మొదటివారం కలెక్షన్లు ఎంతంటే..?

By BhaaratToday | Published On Jan 19th, 2019

ఈ సంక్రాంతికి అసలైన విన్నర్ 'ఎఫ్ 2' సినిమానే అని తేల్చేశారు అభిమానులు . కలెక్షన్లు కూడా అదే రేంజిలో ఉన్నాయి. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా ఆయన చేసిన ఈ సినిమా, సంక్రాంతి కానుకగా థియేటర్లకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను కలెక్షన్లు భారీగానే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలివారంలో ఈ సినిమా 35.05 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల షేర్ ను రాబట్టింది. తొలివారంలో ఈ సినిమా ఒక్క నైజామ్ లోనే 11.80 కోట్లను వసూలు చేయడం విశేషం. 

ఇక వినయ విధేయ రామ టాక్ మిశ్రమంగా వచ్చింది. రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'వినయ విధేయ రామ' గురువారంతో బాక్సాఫీసు వద్ద తొలివారం పూర్తి చేసుకుంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బి,సి సెంటర్లలో మంచి వసూళ్లు సాధిస్తూ మాస్ హిట్‌గా నిలిచింది. తొలి వారం ప్రపంచ వ్యాప్తంగా 56.5 కోట్లు షేర్ వసూలైంది. నైజాంలో రూ. 12.09 కోట్లు, ఆంధ్రా ఏరియాలో రూ. 27. 07 కోట్లు, సీడెడ్ ఏరియాలో రూ. 10.94 కోట్లు, కర్నాటకలో రూ. 5.12 కోట్లు, యూఎస్ఏలో రూ. 60 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 68 లక్షల షేర్ రాబట్టింది.