Sunday, August 18, 2019
Follow Us on :

ఫేస్‌బుక్‌కు భారీ జ‌రిమానా...ఇంత భారీ జ‌రిమానా విధించ‌డం తొలిసార‌ట‌

By BhaaratToday | Published On Jul 17th, 2019

సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్‌కు భారీ జ‌రిమానా ప‌డ‌నుంది. తమ కస్టమర్ల పర్సనల్ డేటాను లీక్ చేసిందన్న ఆరోపణలపై భారీ జరిమానా విధించేందుకు అమెరికా నియంత్రణ సంస్థలు సిద్ధపడ్డాయి. తాజాగా 'వాల్ స్ట్రీట్ జర్నల్'లో ప్రచురితమైన కథనం ప్రకారం, ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ (ఎఫ్టీసీ) సెటిల్ మెంట్ లో భాగంగా ఫేస్‌ బుక్‌ పై రూ. 34,280 కోట్ల (5 బిలియన్‌ డాలర్లు) జరిమానా విధించేందుకు నిర్ణ‌యం తీసుకుంది. కాగా, వ్యక్తిగత భద్రతా వైఫల్యాలకు సంబంధించి ఓ సంస్థపై ఎఫ్‌టీసీ ఇంత భారీ జరిమానాను విధించడం ఇదే మొద‌టిసారి కావడం గమనార్హం. అయితే, ఈ జరిమానాను అమెరికా న్యాయశాఖ ఆమోదించాల్సి ఉంది. ఇక జరిమానా తరువాత వినియోగదారుల వ్యక్తిగత భద్రతకు సంబంధించి ఫేస్‌ బుక్‌ కు కొన్ని కఠిన ఆంక్షలను కూడా ఎఫ్టీసీ విధించనున్నట్టు సమాచారం.