Monday, September 23, 2019
Follow Us on :

నమ్మొద్దు.. నమ్మొద్దు.. ఆర్ఆర్ఆర్ సినిమాలో అవకాశాలు ఇస్తామంటే..!

By BhaaratToday | Published On Sep 1st, 2019

మోసపోయే వాళ్ళు ఉండాలే కానీ మోసం చేసే వాళ్ళు పూటకొకరు పుట్టుకొస్తూనే ఉంటారు. ఇక సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ మోసం చేసే బ్యాచ్ లు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం రాజమౌళి రూపొందిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ చిత్రం విషయంలో ఇలాంటి మోసాలే జరుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ లో ఛాన్స్ ఇప్పిస్తామంటూ కొందరిని మోసం చేశారు. ఆ విషయం ఆ చిత్ర నిర్మాతల దృష్టికి చేరింది. దీంతో అలాంటి వారిని నమ్మొద్దని చెబుతున్నారు. 

దర్శకుడు రాజమౌళి పేరు చెప్పి, ఆర్ఆర్ఆర్ సినిమాకు కాస్టింగ్ కాల్స్ అంటూ నకిలీ ప్రకటనలు ఇస్తున్నారని.. రాజమౌళి పేరుతో సోషల్ మీడియాలో ఖాతాలు తెరిచి, ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం నటీనటులు కావాలని వాటి ద్వారా మోసపూరిత ప్రచారం చేస్తున్నారని డీవీవీ ఎంటర్టయిన్ మెంట్స్ సంస్థ తెలిపింది. ఆర్ఆర్ఆర్ కు సంబంధించి ఎలాంటి సమాచారాన్నయినా అఫీషియల్ సోషల్ మీడియా చానల్ ద్వారానే వెల్లడిస్తామని క్లారిటీ ఇచ్చింది. మోసపూరిత ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని డీవీవీ స్పష్టం చేసింది.