Saturday, August 24, 2019
Follow Us on :

అప్పుల బాధ తాళలేక కుటుంబం ఆత్మహత్య

By BhaaratToday | Published On Mar 16th, 2019

అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం ఆత్మహత్య కు పాల్పడి మృతి చెందిన సంఘటన అల్లీనగరం లో శుక్రవారం అర్థరాత్రి జరిగింది. గ్రామంలో నివాస‌ముంటున్న‌ జక్కా రాఘవేంద్ర నాగరాజు (42), భార్య ఈశ్వరమ్మ (38) మ‌రియు వీరి సంతానం వైష్ణవి (13), వరలక్ష్మి (12)లు పురుగుల మందు సేవించి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. వివ‌రాల్లోకెళితే.. నాగరాజు గతం లో చిల్లర దుకాణం పెట్టుకొని జీవనం సాగించే వాడు. దుకాణం స‌రిగా న‌డ‌వ‌క‌ అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఈ నేఫ‌థ్యంలో 6 సంవత్సరాల క్రితం బెంగుళూరు కి వెళ్లారు. తనకు తెలిసిన వారి వద్ద రెస్టారెంట్లో పని చేస్తున్నాడు. శుక్రవారం  బెంగుళూరు నుండి అల్లినగరం గ్రామానికి చేరుకున్నాడు. అందరూ నిద్ర పోగా నాగరాజు గృహం నుండి పురుగుల మందు వాసన అధికంగా వస్తుండటం తో చుట్టూ పక్కల గృహాల వారు అనుమానం వచ్చి గృహం దగ్గరికి వెళ్లి తలుపులని బద్దలు కొట్టి లోపల చూడగా తండ్రి, తల్లి, పెద్ద కుమార్తె, అక్కడికక్కడే మృతి చెందగా.. చిన్న పాప కొన ఊపిరితో ఉండగా ప్రైవేట్ వాహనం లో వైద్యశాల కు తరలిస్తుండగా మృతి చెందింది. పురుగుల‌ మందు డబ్బాలు చెల్లా చెదురుగా పడి ఉండటాన్ని బట్టి స్థానికులు పురుగు మందు తాగి చనిపోయారని గుర్తించారు. స్థానిక ఎస్సై బ్రహ్మనాయుడు ఘటనా స్థలానికి చేరుకొని గృహాన్ని పరిశీలించి ఆత్మహత్య లేఖ ను స్వాధీన పరుచుకున్నట్లు స‌మాచారం.