Sunday, August 25, 2019
Follow Us on :

కాసుల వ‌ర్షం కురిపిస్తున్న ఫ్యాన్సీ నంబ‌ర్లు...ఈ ఫ్యాన్సీ నంబ‌ర్ ధ‌ర ఎంత‌నో తెలుసా..?

By BhaaratToday | Published On Apr 16th, 2019

తెలంగాణ రవాణా శాఖకు ఫ్యాన్సీ నంబర్లు కాసులు కురిపిస్తున్నాయి. ఖైరతాబాద్‌లోని సెంట్రల్‌ జోన్‌ ఆర్టీఏ కార్యాలయంలో ఒకే రోజు ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రూ. 30.55 లక్షలు రవాణా శాఖకు ఆదాయం వచ్చి చేరింది. టీఎస్ 09ఎఫ్‌ఈ 9999 ఫ్యాన్సీ నంబర్‌ను ఎన్‌ఎస్‌ఎల్‌ ప్రాపర్టీస్ రూ. 10 లక్షలకు సొంతం చేసుకుంది. కోటి 63లక్షలు విలువ చేసే టొయోటా ల్యాండ్‌ క్రూజర్‌ కారు కోసం ఈ నంబరుకు అధిక మొత్తం చెల్లించారు. టీఎస్ 09 ఎఫ్‌ఈ0001 ఫ్యాన్సీ నంబరును ఎఫ్‌ఆర్‌ఆర్‌ఎన్‌ హిల్‌ హోటల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రూ. 2.65 కోట్ల విలువ చేసే కారు కోసం రూ. 6.95 లక్షలు వెచ్చింది. టీఎస్ 09 ఎస్‌ఈ 0099 ఫ్యాన్సీ నంబర్‌ను రూ. 2.78లక్షలు వెచ్చించారు. వీటితో పాటు సోమవారం ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయం పరిధిలోని ఫ్యాన్సీ నంబర్ల ద్వారా మొత్తం రూ. 30.55 లక్షల ఆదాయం వచ్చిందని హైదరాబాద్‌ జిల్లా జేటీసీ జె.పాండురంగ నాయక్‌ తెలిపారు.