Friday, July 19, 2019
Follow Us on :

ఐపీఎల్ పైన‌ల్ మ్యాచ్ టికెట్ల కోసం అభిమానుల ప‌డిగాపులు

By BhaaratToday | Published On May 12th, 2019

కాసేపట్లో హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక‌గా ఐపీఎల్-12 సీజన్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్‌ లో అత్యంత విజయవంతమైన జట్లుగా పేరుగాంచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌ టైటిల్‌ కోసం హోరాహోరీ తలపడేందుకు సిద్ధమయ్యాయి. దీంతో ఈ ఆదివారం.. క్రికెట్‌ ప్రపంచమంతా హైదరాబాద్‌వైపే దృష్టి పెట్టింది. 

మరోవైపు అన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న క్రికెట్ అభిమానులకు ఇప్పటి వరకు టికెట్లు అందలేదు. దీనికోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. హెచ్ సీఏ అధికారులు కాంప్టిమెంటరీ టికెట్లను కూడా బ్లాక్ లో అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు. దూర‌ప్రాంతాల నుంచి వ‌చ్చిన అభిమానులు టికెట్లు అంద‌క ఇబ్బందులు ప‌డుతున్నారు.

ఇదిలాఉంటే మేడ్చల్‌ జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్ 300 ఐపీఎల్‌ టికెట్లు కావాలంటూ హెచ్ సీఏ అధికారుల‌కు లేఖ రాశారు. మ్యాచ్ వీక్షించ‌డానికి  ఉన్నతాధికారులకు టికెట్లు కావాలని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ అధికారికంగా లేఖ రాయడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. ఆ అధికారికి మెమో ఇచ్చి వివరణ కోరుతామని ఉన్నతాధికారులు అన్నారు.