Saturday, October 19, 2019
Follow Us on :

ఆయనను చంపించేందుకు అమిత్ షా కుట్రలు పన్నారట..!

By BhaaratToday | Published On Aug 6th, 2019

ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై తీవ్ర కసరత్తు చేశాకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎవరైతే కొందరు నాయకులు దీనికి వ్యతిరేకంగా ఉన్నారో.. వారందరినీ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. అలాగే జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాను అరెస్టు చేశారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఫరూక్ అబ్దుల్లా మాత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనను చంపించేందుకు కుట్రలు పన్నుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

శ్రీనగర్ లో మీడియాతో ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ తనను అక్రమంగా నిర్బంధించారని, తన కుమారుడు ఒమర్ అబ్దుల్లాను జైల్లో పెట్టారని, ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదని ఆయన మండిపడ్డారు. జమ్ముకశ్మీర్ కు చెందిన ముఖ్య నేతలందరినీ రహస్య ప్రాంతాల్లో నిర్బంధించారని, ఇది రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని ఆరోపించారు.