Thursday, September 19, 2019
Follow Us on :

ఆర్థికంగా కుదేలైన పాక్ కు మరో భారీ షాక్

By BhaaratToday | Published On Aug 23rd, 2019

పాకిస్థాన్ ఇప్పటికే ఆర్థికంగా కుదేలైన సంగతి తెలిసిందే. పెట్టుబడులు రాక.. సరైన ఆదాయం లేక ఆ దేశ ఆర్థిక పరిస్థితి చాలా దిగజారిపోతూ ఉంది. ఇప్పటికే పాకిస్థాన్ రూపాయి విలువ భారీగా పతనమైంది. పెట్టుబడుల కోసం ఆ దేశ ప్రధాని వేరే దేశాల్లో పర్యటిస్తున్నా ఎటువంటి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఎవరూ రావడం లేదు. 

ఆర్థికంగా కుదేలైన పాక్ కు మరో షాక్ ఇచ్చింది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్). అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలపై నిఘా ఉంచడం ఈ సంస్థ చేసే పని..! టెర్రరిస్టు సంస్థలకు ఆర్థిక సాయం అందించడం, మనీ లాండరింగ్ కు పాల్పడటం వంటి కారణాలతో పాక్ ను బ్లాక్ లిస్ట్ లో ఉంచింది. ఒకవేళ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇచ్చిన డెడ్ లైన్ లోపు పాక్ తీరుమారకపోతే ఆ దేశ క్రెడిట్ ర్యాంకింగ్ ను ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ లు డౌన్ గ్రేడ్ చేస్తాయి. దీంతో అప్పులు పుట్టక మరింత దీన స్థితికి పాకిస్థాన్ వెళ్లిపోయే అవకాశం ఉంది.  

 టెర్రరిస్టులకు నిధులను అందించే అంశానికి సంబంధించి 40 పారామీటర్స్ లో 32 పారామీటర్స్ కరెక్ట్ గా లేవని ఎఫ్ఏటీఎఫ్ తెలిపింది. 41 మంది సభ్యుల ప్యానెల్ ను పాకిస్థాన్ తన వాదనతో ఒప్పించలేకపోవడంతో బ్లాక్ లిస్టులో చేర్చింది. అక్టోబరులోగా పాకిస్థాన్ కు డెడ్ లైన్ విధించింది. ఒక వేల పాకిస్థాన్ ఆ సమయం లోపు అంతర్జాతీయ స్థాయిలో ఆ దేశ క్రెడిట్ రేటింగ్ పడిపోతుంది.