Thursday, September 19, 2019
Follow Us on :

అరుణ్ జైట్లీ చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

By BhaaratToday | Published On Aug 17th, 2019

ఢిల్లీలోని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సముదాయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఎమర్జెన్సీ వార్డు సమీపంలో ప్రారంభమైన మంటలు కొద్దిసేపట్లోనే వ్యాపించాయి. అగ్నిమాపక దళం 22 ఫైరింజన్లను అక్కడికి తరలించింది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Image result for aiims

 ఎయిమ్స్ లో కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కూడా అత్యవసర చికిత్స పొందుతుండడంతో ఆందోళన నెలకొంది. అయితే ఆయనకు ఎయిమ్స్ ప్రాంగణంలోని మరో భవనంలో చికిత్స నిర్వహిస్తున్నట్టు తెలిసింది.
Image result for aiims

మాజీ ఆర్థికమంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన్ను లైఫ్ సపోర్ట్ పై ఉంచారు. ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండగా, న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స నిమిత్తం చేర్పించారు. ఆయన ఆరోగ్యం విషమించిందన్న విషయాన్ని తెలుసుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, పలువురు ముఖ్య నేతలు ఆయనను పరామర్శించడానికి ఎయిమ్స్ కు వెళ్ళారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడంతో అభిమానులనూ, కుటుంబ సభ్యులనూ కలవరపెడుతోంది.  

Image result for aiims

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆగస్టు 9 న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఆయన్ని చేర్చారు. గత ఏడాది జైట్లీకి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. రెగ్యులర్ మెడికల్ చెకప్ నిమిత్తం ఈ ఏడాది జనవరిలో ఆయన అమెరికా వెళ్లారు. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిపాలైన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ నిపుణులైన డాక్టర్ల బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.