Monday, September 23, 2019
Follow Us on :

పాకిస్థాన్ గురించి పాకిస్థాన్ నేతలే బయటపెట్టేశారు.. భారత్ ఆశ్రయం కోరిన ఇమ్రాన్ పార్టీ నేత

By BhaaratToday | Published On Sep 10th, 2019

ఎన్నో ఏళ్లుగా పాకిస్థాన్ లో హిందువులు, సిక్కులు, మైనారిటీ ప్రజలను ఊచకోత కోస్తున్నారు. పాకిస్థాన్ లో ఇతర మతాల వారిని బ్రతకనీయడం లేదని ఇప్పటికే ప్రపంచదేశాల ముందు సాక్షాలను ఉంచింది భారత్. ఇక ఇటీవలి కాలంలో పాకిస్థాన్ లో మైనారిటీ మహిళలను దాచిపెట్టడం, అడ్డొచ్చిన వారిని బెదిరించడం లాంటివి ఎక్కువైపోయాయి. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా దీనిపై స్పందించారు.. కానీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్    ఇమ్రాన్‌ఖాన్ సారథ్యంలోని తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ నేత బల్దేవ్ కుమార్ సంచలన విషయాన్ని బయటపెట్టారు. పాకిస్థాన్‌లో మైనార్టీలైన హిందువులు, సిక్కులను చంపేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన కుటుంబతో కలిసి పాకిస్థాన్ వదిలి భారత ఆశ్రయం కోరారు.

పాకిస్థాన్ వదిలి భారత్ వచ్చేసిన ఆయన తన కుటుంబానికి ఆశ్రయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సోరన్‌సింగ్ అనే వ్యక్తి హత్య కేసులో బల్దేవ్‌పై అరోణలున్నాయి. పోలీసులు ఆయనను తీవ్రంగా వేధించారు. అయితే, ఈ కేసులో బల్దేవ్‌పై చేసిన ఆరోపణలపై ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో కోర్టు ఆయనను నిర్దోషిగా విడుదలచేసింది. దీంతో పాకిస్థాన్‌లో ఉండడం క్షేమం కాదని భావించిన బల్దేవ్ భార్య, పిల్లలతో కలిసి భారత్ చేరుకున్నారు. పాకిస్థాన్ లో ఇతర మతాల వారిని అసలు బ్రతకనివ్వడం లేదని ఆయన ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు.