Sunday, August 25, 2019
Follow Us on :

సినిమా చూపిస్త ఓట‌ర్ నీకు.. సినిమా చూపిస్త‌..!

By BhaaratToday | Published On Mar 20th, 2019

ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నాయకులు కొత్త కొత్త తాయిలాలను అందిస్తున్నారు. ఇలాంటిదే చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో చోటుచేసుకుంది. మంగళవారం తిరుపతిలో ‘యాత్ర’ సినిమాకు ఒకే గ్రామం నుంచి బస్సుల్లో భారీగా జనం తరలివచ్చారు. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని రామచంద్రాపురం మండలానికి చెందిన ఓ నాయకుడు.. యాత్ర సినిమా చూపించడానికి గ్రామస్థులను తీసుకువచ్చారు. 

గుంపులు, గుంపులుగా బస్సుల నుంచి దిగడం గమనించిన ఎన్నికల విధుల్లో ఉన్న సెక్టోరల్‌, పోలీసు అధికారులు.. వెంటనే వారిని ప్రశ్నించగా ఒకరి వద్ద 100కు పైగా యాత్ర సినిమా టికెట్లు లభ్యమయ్యాయి. వాటిపై తేదీ, ప్రదర్శన సమయం లేకపోవడం గమనార్హం. ఇన్ని టికెట్లు ఎలా వచ్చాయని అధికారులు ప్రశ్నించగా.. మేమందరం ఒకే గ్రామానికి చెందిన వారమని, సినిమా చూసేందుకు కలిసి వచ్చినట్లు వివరించారు. ఎన్నికల అధికారులు ఈ విషయాన్ని తిరుపతి నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి విజయరామరాజు దృష్టికి తీసుకెళ్లారు.