Friday, July 19, 2019
Follow Us on :

కోహ్లీపై గంభీర్ సంచలన వ్యాఖ్యలు..!

By BhaaratToday | Published On Mar 19th, 2019

 ఐపీఎల్ కు రంగం సిద్ధమైంది. 23వ తేదీ నుండి ఐపీఎల్ హంగామా మొదలుకాబోతోంది. ఇప్పటి దాకా ఐపీఎల్  కప్ అందుకోలేని జట్ల లిస్టులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించే ఎక్కువగా చర్చిస్తారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నా కూడా ఐపీఎల్ ట్రోఫీని అందించలేకపోతున్నాడు. దీనిపై భారతజట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోహ్లీని కెప్టెన్ గా కొనసాగించడమే చాలా ఎక్కువ అంటూ తన అభిప్రాయాన్ని తెలపడంతో తీవ్ర చర్చకు దారి తీసింది.    


కోహ్లీని తాను తెలివైన కెప్టెన్ అని ఎప్పుడూ భావించడం లేదని గంభీర్ చెప్పుకొచ్చాడు.ఇప్పటి వరకు కూడా బెంగళూరు ఒక్క ఐపీఎల్ ట్రోఫీని కూడా దక్కించుకోలేక పోయిందని.. కోహ్లీ తీసుకున్న తప్పుడు నిర్ణయాలే అందుకు కారణం అని గంభీర్ అన్నాడు. ఇన్ని ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా కోహ్లీని కెప్టెన్ గా కొనసాగించడమే చాలా ఎక్కువ అని తన అభిప్రాయమని గంభీర్ చెప్పడం వివాదానికి దారి తీసింది. ధోని మరియు రోహిత్ శర్మలు కెప్టెన్ లుగా మూడు సార్లు ఐపీఎల్ ను సాధించారు. వారితో కోహ్లీకి పోలిక వద్దే వద్దు అంటూ గంభీర్ అన్నాడు. 

ఇక ఐపీఎల్ పూర్తీ షెడ్యూల్ కూడా వచ్చేసింది. దాదాపు అన్ని జట్లు కూడా తమ ఆటగాళ్ళతో ప్రాక్టీస్ సెషన్లు మొదలుపెట్టేశారు. క్రికెట్ అభిమానులు కూడా మార్చి 23 కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు.