
ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కామెంట్ చేశాడు. ట్విట్టర్ వేదికగా ఐరాస తీర్మానానికి అనుగుణంగా కశ్మీరీ ప్రజలకు భారత ప్రభుత్వం కనీస హక్కులు ఇవ్వడం లేదని, అసలు ఐరాస ఏర్పాటు ఎందుకు జరిగిందో తెలియడం లేదని అన్నాడు. హక్కుల ఉల్లంఘన ఈ స్థాయిలో ఉన్నా, ఐరాస నిద్రపోతోందని, కశ్మీరీల హక్కుల ఉల్లంఘనపై ఎందుకు ఐక్యరాజ్యసమితి స్పందించట్లేదని ప్రశ్నించాడు. అఫ్రీది చేసిన ట్వీట్ ను యూఎన్ఓ, డొనాల్డ్ ట్రంప్ కు ట్యాగ్ చేశాడు.
ఆఫ్రిదీ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ ఆటగాడు, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తనదైన రీతిలో స్పందించాడు. మానవ హక్కుల గురించి ఆఫ్రిదీ మాట్లాడటం చాలా సంతోషకరమని అన్నాడు. మానవ హక్కుల హణనం 'పాక్ ఆక్రమిత కశ్మీర్' లో మాత్రమే జరుగుతోందనే విషయాన్ని చెప్పడం ఆయన మర్చిపోయారని సెటైర్ వేశాడు. ఆఫ్రిదీ కంగారు పడాల్సిన అవసరం లేదని అన్ని విషయాలను తాము చూసుకుంటామని చెప్పాడు.